Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ 98వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవంలో అవార్డు ప్రజెంటర్‌గా ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ క్రమంలో ఆమె ఈవెంట్‌కి వచ్చినప్పుడు ఎప్పటిలా మెరిసిపోయింది. తెలుపు రంగు లాంగ్‌ ఫ్రాక్‌, మెడలో నెక్లెస్‌తో వావ్‌ అనిపించింది. అప్పుడు వావ్‌ అన్నవారు.. ఆ నగ ధర తెలిశాక ఇప్పుడు మరోసారి డబుల్‌ వావ్‌ అంటున్నారు. ఎందుకంటే దాని ధర సుమారు రూ.8 కోట్లు.

Priyanka Chopra

ఎందుకంటే ప్రియాంక ధరించిన నగ ప్లాటినం, వజ్రాలతో సిద్ధం చేసింది. బుల్గారీ అనే కంపెనీ ఈ నెక్లెస్‌ను తయారు చేసింది. 235 ఎలిమెంట్లను ఒకదానితో ఒకటి కలిపి, సుమారు 1300 గంటల పాటు కష్టపడి ఈ నెక్లెస్‌ను తయారు చేశారట. నగ మధ్యలో అమర్చిన 14 క్యారెట్ల నీలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ నీలాన్ని మడగాస్కర్ నుంచి తెప్పించారట. ఇక త్రీడీ టెక్నాలజీతో రూపొందించిన ఈ నగ ఓ పక్క నుంచి చూసినా మొత్తం కనిపిస్తుంది.

ఇక ఈ నెక్లెస్‌తో పాటు వజ్రాలు, ప్లాటినంతో చేసిన ఉంగరం, చెవి రింగులు కూడా ధరించింది ప్రియాంక చోప్రా. వీటిని కూడా కలిపితే మొత్తం ఆభరణాల ధర మరింత పెరుగుతుంది. ఇలా ఓ కార్యక్రమానికి వచ్చింది అంటే ప్రియాం ఇమేజ్‌ ప్రపంచ మార్కెట్‌లో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ‘ది బ్లఫ్‌’ సినిమాతో ఓటీటీలో అలరించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి – మహేష్‌ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. త్వరలో అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఆమెనే లీక్‌ చేసింది. ‘ది బ్లఫ్‌’ కోసం మహేష్‌ రివ్యూ ఇస్తే.. త్వరలో అంటార్కిటికా కలుద్దాం అని చెప్పింది. అంటే ‘వారణాసి’ సినిమా కొత్త షెడ్యూల్‌ అక్కడే అన్నమాట. మరి టీమ్‌ ఎప్పుడు ఆ మంచు ప్రాంతానికి వెళ్తుందో చూడాలి.

అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus