సాధారణంగా కొందరు కొన్ని న్యూమరాజికల్ నెంబర్లను ఎంతో అదృష్టంగా భావిస్తారు. మరికొందరు దురదృష్టంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఇలాంటి సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్నకు కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తుంది. ఈయనకు న్యూమరాలజికల్ నెంబర్ 9 చాలా బాడ్ సెంటిమెంట్ గా మారిందని తెలుస్తోంది.
ఈయన జీవితంలో 9 సంఖ్య తనకు కలిసి రాలేదని, అదే సంఖ్య ఆయనకు శాపంగా మారిందని తెలుస్తోంది. తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈయన ఒకేరోజు ఏకంగా తొమ్మిది సినిమాలకు సైన్ చేశారు. ఇలా 9 సినిమాలకు ఒక్కరోజు సైన్ చేయడం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలా ఏ హీరో కూడా ఈ రికార్డును చెరిపి వేయలేదు. అయితే 9 సినిమాలకు సైన్ చేయగా ఇందులో ఆరు సినిమాలు షూటింగుకు నోచుకోలేదు.
మిగిలిన మూడు సినిమాలు షూటింగ్ జరిపిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తారకరత్నకు పేరు రాలేదు. ఇలా9 సినిమాలలో ఆరు సినిమాలు ఆగిపోవడంతో ఆయనకు 9 అనే సంఖ్య కలిసి రాలేదని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన తారకరత్న రాజకీయాలలోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజు ఆయనకు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.
లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తేదీ జనవరి 27. ఈ విధంగా 2,7 లను కలిపితే 9 వస్తుంది. ఇలా ఇదే తేదీన ఈయన గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోవడం అప్పటినుంచి 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా విషమ పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించడంతో చివరికి ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.
ఇలా ఈయన మరణించిన తేదీని కూడా కలిపి కూడితే 9 అనే సంఖ్య వస్తుంది. దీంతో తారకరత్నకు 9 అనే నెంబర్ చాలా బ్యాడ్ సెంటిమెంట్ గా మారిందని ఈ నెంబర్ తన జీవితంలోనే తనకు శాపంగా మారిందని పలువురు భావిస్తున్నారు.ఇలా తారకరత్న క్షేమంగా తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆయన లేరనే వార్త తెలియడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.