Pooja Hegde: పూజా హెగ్డే ఇంటి నుండి కార్స్, హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

పూజా హెగ్డే.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటుంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. ఈ ఏడాది పూజా.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరు, చరణ్‌ల ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ చేస్తోంది. ఇటీవలే కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటోంది. స్టార్ హీరోయిన్‌గా కోట్లాది రూపాయలు తీసుకునే పూజా పాప లగ్జీరియస్ లైఫ్ గురించి, విలువైన 9 విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. అదిరిపోయే అపార్ట్‌మెంట్..

బాంబోలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్‌మెంట్ కాస్ట్ రూ. 6 నుండి 8 కోట్ల వరకు ఉంటుంది..

2. హైదరాబాద్‌లోనూ ఇల్లు..

షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండాల్సి రావడంతో దాదాపు రూ. 5 కోట్లతో ఓ లగ్జరీ హౌస్ తీసుకుంది..

3. పోర్షియో కయెన్ కార్..

కాస్ట్లీ ఇళ్లతో పాటు కార్స్ కూడా చాలా ఇష్టం తనకి.. అక్షరాలా రూ.2 కోట్లతో పోర్షియో కయెన్ కార్ కొనుక్కుంది..

4. జాగ్వార్ కార్..

పూజా దగ్గర రూ. 1.08 కోట్లు ఖరీదు చేసే జాగ్వార్ కార్ కూడా ఉంది..

5. ఆడి కార్ ఎంతంటే..

బుట్టబొమ్మ దగ్గర ఆడి క్యూ 7 మోడల్ ఉంది.. దీని ధర రూ. 85 లక్షలు..

6. బీఎండబ్యూ కూడా..

పూజా గ్యారేజ్‌లో రూ. 80 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ 350 డి కూడా ఉంది..

7. లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్..

లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 1.91 లక్షలు..

8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ బ్యాగ్..

పూజా దగ్గరున్న మరో కాస్ట్లీయెస్ట్ హ్యాండ్ బ్యాగ్ లూయిస్ విట్టన్ క్రోయిసెట్.. దీని ప్రైస్ రూ. 1.4 లక్షలు..

9. క్రిస్టియన్ డియోర్..

రూ. 1.3 లక్షల ఖరీదైన క్రిస్టియన్ డియోర్ హ్యాండ్ బ్యాగ్ కూడా తన కలెక్షన్స్‌లో ఉంది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus