నటి మధుశాలిని(Madhu Shalini) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె అటు తర్వాత యాంకర్‌గా కూడా పలు షోలు హోస్ట్ చేసింది.
అటు తర్వాత ఈమెకు వెండితెరపై అవకాశాలు లభించాయి. ‘ఒక విచిత్రం’, ‘కితకితలు’ ‘గోపాల గోపాల’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ‘అవన్ ఇవన్’ (తెలుగులో ‘వాడు-వీడు’) వంటి క్రేజీ సినిమాల్లో నటించింది.
రామ్ గోపాల్ వర్మ ఈమెను ‘డిపార్ట్‌మెంట్’ తో బాలీవుడ్ కి కూడా పరిచయం చేశారు. తర్వాత ‘ఎక్స్పైరీ డేట్’ ‘9 హవర్స్’ వంటి వెబ్ సిరీస్..లలో సైతం మధు శాలిని నటించడం జరిగింది.’కన్యాకుమారి’ అనే సినిమాతో ఈమె నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇటీవల కాలంలో ఈమె నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. 2022 లో మధుశాలిని నటుడు గోకుల్ ఆనంద్ ను వివాహం చేసుకుంది.
ఆల్రెడీ పెళ్ళైన నటీమణులు ఇలాంటి గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటారు. అయితే మధుశాలిని మాత్రం నెక్స్ట్ లెవెల్లో గ్లామర్ షో చేస్తుంది. విమెన్స్ డే రోజున కూడా ఈమె గ్లామర్ వైట్ అండ్ వైట్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ లో మైండ్ బ్లాక్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :