అ…ఆ స్టోరీ ఇదేనా???

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, అందాల భామ సమంతాతో తెరకెక్కించిన చిత్రం “అ…ఆ”. ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనే కాదు, ఇటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ కూడా భారీ హిట్ కొట్టి, కొత్తదనంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంతలోనే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ సైతం చక్కర్లు కొడుతోంది. మరి ఆ కధ ఏంటో ఒక లుక్ వేద్దాం రండి…టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న క్వాడన ప్రకారం….సమంత కోటీశ్వరురాలు..

ఈమె హైఫై జీవితాన్ని గడుపుతుంటుంది. మరోవైపు.. నితిన్ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. చెఫ్‌గా పనిచేసే నితిన్ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఓ చిన్న గ్రామంలో వుంటాడు. ఓ రైలు ప్రయాణంలో వీరిద్దరూ అనుకోకుండా కలుస్తారు. ఆ ప్రయాణంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటి కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

కానీ.. ఒకరికొకరు వ్యక్తపరుచుకోరు. కట్ చేస్తే.. నితిన్‌ని పెళ్ళి చేసుకోవాలని అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ.. నితిన్ మాత్రం సమంతనే చేసుకోవాలని అనుకుంటుంటాడు. అయితే.. ఇంతలోనే నితిన్‌ మనసు మార్చుకుని అనుపమతో పెళ్ళికి సిద్ధమవుతాడు. నితిన్ ఎందుకు తన మనసు మార్చుకుంటాడు? ఎందుకు ప్రేమించిన సమంత నుంచి దూరమవుతాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. కధ బాగానే ఉంది, దానికి త్రివిక్రమ్ స్టైల్ కధనం తోడైతే….సుర్రు సుమ్మైపోద్ది….

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus