టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ అండ్ గ్ల్యామరస్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. ఒక పక్క అందాల పాత్రలు చేస్తూనే మరో పక్క, చారిత్రాత్మక, హీరోయిన్ ఓరియెన్టెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. అయితే జయాపజయాలతో సంభంధం లేకుండా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అనుష్కకు చేదు అనుభవం ఎదురయింది. అసలు ఏమయింది? అనుష్కకు చేదు అనుభవం ఏంటి? ఎవరి వల్ల అని తెలుసుకోవాలి అంటే, ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అయిపోతుంది, విషయంలోకి వెళితే, సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్క అక్కడ అనుకోకుండా లోకల్ రావాణా శాఖ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఎందుకంటే షూటింగ్ స్పాట్లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్‌ను స్థానిక రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారవాన్‌ను తనిఖీ చేయగా.. సరైన పత్రాలు లేకుండా ఈ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో కారవాన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తంగా పాపం అనుష్కను కాసేపు రోడ్డు మీద నిలబెట్టి ఇబ్బంది పెట్టేశారు రవాణా అధికారులు. అదీ మన తమిళనాడు రావాణా శాఖ వాళ్ళు చేసిన ఘనకార్యం. పాపం అనుష్క.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.