Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే
- November 22, 2026 / 08:05 PM ISTByPhani Kumar
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అతను నటించే సినిమాలు సమాంతరంగా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఏడాదికి రెండు లేదంటే ఒకటి చొప్పున స్ట్రైట్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నాడు దుల్కర్ సల్మాన్. అతను నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార'(Aakasamlo Oka Tara)
Aakasamlo Oka Tara

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ ‘వైజయంతీ మూవీస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. కానీ అంతగా బజ్ ఏర్పడలేదు. మొదటి రోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కానీ రిలీజ్ కి ముందు బజ్ లేకపోవడంతో మొదటి రోజు సాదా సీదా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.35 cr |
| సీడెడ్ | 0.07 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.40 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 0.84 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ కేరళ | 0.28 cr |
| ఓవర్సీస్ | 0.45 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 1.55 (షేర్) |
‘ఆకాశంలో ఒక తార’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.9 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు రూ.1.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.8.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు కంటే బెటర్ గా ఉన్నాయి.












