ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి
- November 22, 2026 / 04:40 PM ISTByFilmy Focus Desk
‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat)లో శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’లో గ్యాంగ్‌లో కొత్త కుర్రాడిగా శ్రీనాథ్ మాగంటి పేరును ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సుశాంత్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలో శ్రీనాథ్ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే విమర్శలను, ట్రోల్స్‌ను తన నటనతో ప్రశంసలుగా మార్చుకున్నాడు శ్రీనాథ్.
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంలతో కలిసి ప్రధాన పాత్రలో నటించిన ఆయన తన అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంటున్నారు. ఇతర నటులను అనుకరించడానికి ప్రయత్నించకుండా తరుణ్ భాస్కర్ ఊహించుకున్న పాత్రకు తగ్గట్టుగా, తన నిజాయితీతో ప్రాణం పోశాడు శ్రీనాథ్ మాగంటి.
శివాత్మిక రాజశేఖర్‌తో శ్రీనాథ్ మాగంటి కెమిస్ట్రీ, ఇద్దరి జంట తెరపై అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కోణాల్లో శ్రీనాథ్ ఆడియెన్స్‌ని మెప్పించారు. మొత్తానికి తనకు లభించిన ఈ అవకాశాన్ని సవాలును స్వీకరించి, ఒక నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.













