Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే హైలెట్స్ ఇవే..! స్టేజ్ పైన ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే, విన్నర్ మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈ విన్నర్ షూటింగ్ ఆదివారంకి పోస్ట్ పోన్ చేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్లు. దీనికి కారణం ఏంటంటే, గత సీజన్ లో ముందుగానే లీక్స్ అవ్వడం వల్లే విన్నర్ పై ఆసక్తి తగ్గిపోయింది. అంతేకాదు, హౌస్ లోకి హింట్స్ వెళ్లడం వల్ల కూడా క్యాష్ ప్రైజ్ తీసుకునేందుకు పార్టిసిపెంట్స్ వెనకాడలేదు. విన్నర్ ఎవరో ముందే తెలిసింది కాబట్టి ఫినాలే చూసేందుకు మజా పోయిందనేది ఆడియన్స్ అభిప్రాయం.

అందుకే, ఈసారి ఎక్కడా లీక్స్ కాకుండా లైవ్ టెలికాస్ట్ ని ప్లాన్ చేశారు. సాయంత్రం 6గంటలకి షూటింగ్ ఫినిష్ అయితే, దాన్ని రాత్రి 10.30 నిమిషాలకి టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీలో మోత మోగిపోయింది. సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్స్ కదలి వచ్చారు. ఫస్ట్ ఈగల్ సినిమా ప్రమోషన్ కోసం హీరో రవితేజ స్టేజ్ పైకి వచ్చాడు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సందడి చెసినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఇక మరోవైపు యాంకర్ సుమ కూడా తన అబ్బాయి రోషన్ కనకాల సినిమా బబుల్ గమ్ ప్రమోషన్స్ కోసం స్టేజ్ పైకి వచ్చింది. అల్లరి నరేష్, హీరోయిన్ నిధి అగర్వాల్, హీరో కళ్యాణ్ రామ్ సందడి చేశారు. వీళ్లందరూ కూడా పార్టిసిపెంట్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే, చీఫ్ గెస్ట్ గా ఫైనల్ గా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు వచ్చినట్లుగా సమాచారం. స్టేజ్ పైకి ఒక్కొక్క పార్టిసిపెంట్ ని ఎలిమినేట్ చేస్తూ తీసుకుని వచ్చాడు కింగ్ నాగార్జున.

ఫస్ట్ అర్జున్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి(Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే వీరికి సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చాడు. అందులో 10 లక్షల వరకూ క్యాష్ ఉందని చెప్పాడు. మీలో ఎవరైనా సరే తీస్కుంటే తక్షణమే ఇంటి నుంచీ వెళ్లిపోవచ్చని చెప్పాడు. కానీ, హౌస్ మేట్స్ ఎవ్వరూ కూడా ఆసక్తికనబరచలేదు. దీంతో సిల్వర్ సూట్ కేస్ స్టోర్ రూమ్ లో పెట్టేశారు. అయితే, హౌస్ లో అర్జున్ తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది.

ప్రియాంక ఎలిమినేషన్ తర్వాత సూట్ కేస్ లో 15 లక్షల వరకూ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఆఫర్ కి టెమ్ట్ అయిన ప్రిన్స్ యావర్ బ్రీఫ్ కేస్ తీస్కుని వచ్చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ 15 లక్షలు తగ్గిపోయింది. ఆ తర్వాత శివాజీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. చివరగా అమర్ దీప్ ఇంకా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాత్రమే మిగిలారు. మరి వాళ్లలో ఎవరు విన్నర్ అవుతాడు అనేది చూడాలి. మొత్తానికి అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus