అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో క్రేజీ హీరో

ఈ అర్జున్ రెడ్డి సినిమా చూసి చూసి ప్రేక్షకులకు, మాట్లాడుకొనీ, విమర్శించి, ప్రశంసించి సగటు జనాలకి బోర్ కొట్టిందో లేదో తెలీదు కానీ.. విడుదలకు వారం ముందు నుంచీ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమా గురించి, ఆ సినిమా క్యాస్ట్ & క్రూ గురించి రాసీ రాసీ మాకు మాత్రం బాగా బోర్ కొట్టేసింది. అయినప్పటికీ.. సినిమాకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయం కావడంతో మరోమారు అర్జున్ రెడ్డి గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు చెప్పదలుచుకొన్నామ్.

అదేమిటంటే.. “అర్జున్ రెడ్డి” తమిళ వెర్షన్ రీమేక్ రైట్స్ ను ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే కదా. అయితే.. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆ రీమేక్ లో తమిళ స్టార్ హీరో శింబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. నిజజీవితంలోనూ అర్జున్ రెడ్డిలాగే యారోగెంట్ గా బిహేవ్ చేసే శింబు అయితేనే ఆ పాత్రను న్యాయం చేయగలడు కాబట్టి అతడ్ని సినిమా కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే.. ఈ సినిమా హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్ నటించే అవకాశాలు ఉన్నాయని, ఆల్రెడీ రణవీర్ సింగ్ “అర్జున్ రెడ్డి” సినిమా చూశాడని, రీమేక్ చేసేదీ లేనిదీ ఈ నెలాఖరుకు ఫిక్స్ అవుతాడని సమాచారం. మరి ఈ వార్తలు ఏమేరకు నిజమవుతాయో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus