Devara: దేవర మూవీ టీజర్ అప్పుడేనా.. ఫ్యాన్స్ కు శుభవార్త అంటూ?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మరో 5 నెలల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే మేకర్స్ మాత్రం దీపావళి సందర్భంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదని త్వరలో పెద్ద బ్లాస్ట్ ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. దేవర మూవీ టీజర్ త్వరలో రిలీజ్ కానుందని మేకర్స్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. 2023 సంవత్సరం జనవరి 1వ తేదీన దేవర రిలీజ్ డేట్ ప్రకటన రాగా 2024 జనవరి1న దేవర టీజర్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆ తేదీకి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ నిజంగా వస్తుందేమో చూడాల్సి ఉంది. దేవర1 సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుండగా దేవర2 సినిమా గురించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాల్సి ఉంది. దేవర సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఉండగా ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా జాన్వీ కపూర్ కెరీర్ కు కీలకం కానుంది.

దేవర (Devara) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో స్లిమ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. దేవర సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దేవర సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా ఇకపై తారక్ వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus