ప్రతిఫలంగా అతను ఏం అడిగాడో తెలుసా?

దేవుడు దిగి వస్తే ఏం కోరుకుంటావు అంటే… చెప్పడానికి కొంచెం టైమ్‌ తీసుకోవడం సహజం. అదే అభిమాన హీరోను కలిసే అవకాశం ఇస్తే ఏం చేస్తావ్‌ అంటే… ఏముంది ఒక సెల్ఫీ, ఓ సంతకం అడుగుతాం. కానీ ఓ కుర్రాడు తన అభిమాన హీరోను చాలా విచిత్రమైన కోరిక అడిగాడు. ఇదంతా జరిగింది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి. ఇటీవల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ లో నిర్ణీత స్పీడ్ కంటే మించి వెళ్లడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌కి ₹1035 రూపాయలు ఫైన్ వేశారు. ఈ ఛలానాను తారక్ కట్టే లోపే ఒక అభిమాని కట్టేశాడట. అప్పుడే ఆ కోరిక కోరాడు.

ఎన్టీఆర్‌ ఛలానాను కట్టేసిన ఆ అభిమాని.. ఎన్టీఆర్‌ సంతకం, సెల్ఫీ, డిన్నర్‌/లంచ్‌ లాంటివి అడిగకుండా… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సిఇనమా మొదటి రోజు, మొదటి షో టికెట్‌ కావాలని కోరాడట. అంతేకాదండోయ్‌ థియేటర్‌ కూడా చెప్పేశాడు. తనకు దగ్గర్లోని భ్రమరాంభ, మల్లికార్జున్ థియేటర్లలోనే కావాలని కోరాడు. ఈ కోరిక విని ఎన్టీఆర్‌ ఎలా ఫీల్‌ అయ్యాడో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం అవాక్కవుతున్నారు. భలే కోరిక కోరాడని కొందరు అంటుంటే… ఇంకొందరు ఇదేం కోరిక అంటున్నారు.

ఇక నిజాలు మాట్లాడుకుంటే… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి టికెట్లు దొరకడం చాలా కష్టం. అందులోనూ భ్రమరాంబ, మల్లికార్జున అంటే ఇంకా కష్టం. అందుకే ఆ అభిమాని అలా అడిగాడు. తన అభిమాన హీరో మొదటి సినిమా చూడటానికి ఇంత చేసిన కుర్రాడిని సహ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్‌ అనుకుంటే సినిమా టికెట్‌ ఇప్పించడం పెద్ద విషయం కాదు. అంతేకాదు ఆ కుర్రాడు చెల్లించిన ఛలానా డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాడు. ఏమంటారు ఫ్యాన్స్‌.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus