Game Changer: స్నేహితుల సమరమా? ఫ్యామిలీలో పోటీనా… ‘గేమ్‌ ఛేంజర్‌’ డేట్ ఏంటి?

Advertisement

ఎన్నికల తేదీలు వచ్చేశాయి. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ల విషయంలో చాలామంది నిర్మాతల అయోమయాలు ఇప్పుడు క్లియర్‌ అవుతున్నాయి. సినిమా రెడీగా ఉన్న కొంతమంది డేట్స్‌ ఫిక్స్‌ చేసుకుని ఇవాలో రేపో చెప్పేస్తారు. దీంతో మిగిలిన సినిమా వాళ్లు కూడా రిలీజ్‌ డేట్‌లు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి వాటిలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఒకటి. చాలా రోజులుగా ఏదో కారణంగా ఆగుతూ ఆగుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు ఫుల్‌ ప్లెడ్జ్‌ స్పీడ్‌లో కొనసాగుతోంది. విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి ఓ చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ పెండింగ్‌ వర్క్‌ ఉంది కాబట్టి ఎప్పుడు షూటింగ్‌ అని అడిగిన అభిమానులు, చర్చించుకున్న వీరాభిమానులు ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ మీద పడ్డారు. మరోవైపు నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం చూస్తోంది అంటున్నారు. ఈ మేరకు రెండు ఫెస్టివల్‌ సీజన్ల గురించి అనుకుంటున్నారట. అవే దసరా, సంక్రాంతి. అవును దిల్‌ రాజు (Dil Raju)  క్యాంప్‌లో ఈ డేట్స్‌ మీద పెద్ద ఎత్తున ప్లానింగ్స్ అవుతున్నాయి అంటున్నారు.

భారీ బడ్జెట్‌, అదిరిపోయే కాంబినేషన్‌ కావడంతో సినిమాకు ఎక్కువ రోజులు జనాలు వచ్చేలా లాంగ్‌ వీకెండ్‌లు వెతుకుతున్నారట. అలాగే ఫెస్టివల్‌ డేస్‌ అయితే బాగుండు అని కూడా అనుకుంటున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టిన రోజు నాడు ‘జరగండీ…’ పాటతో పాటు చెప్పాలనేది టీమ్‌ ప్లానింగ్‌ అంటున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చిందని, అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్లానింగ్‌ చూసుకుని డేట్‌ చెప్పేయాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ఈ ఏడాది దసరా, వచ్చే ఏడాది సంక్రాంతి దిల్‌ రాజు ఆలోచనలో ఉన్నాయట. అయితే సంక్రాతికి చిరంజీవి (Chiranjeevi) సినిమా బరిలో ఉంది. ఇక దసరాకు అయితే ఎన్టీఆర్‌ (Jr NTR) సినిమా ఉంది. దీంతో రామ్‌చరణ్‌ పోటీ స్నేహితునితోనా లేక తండ్రితోనా అనే చర్చ మొదలైంది. ఈ విషయంలో మార్చి 27న పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news