సంచలనం సృష్టిస్తున్న సన్నీ సరికొత్త వీడియో!
- August 27, 2016 / 09:30 AM ISTByFilmy Focus
సన్నీ సరికొత్త వీడియో అనగానే మళ్ళీ అందాలన్నీ ఆరబోసి వేడెక్కించిందా? లేక మరోమారు తన జీవితంలో కాస్త వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా బ్లూ ఫిలిమ్ లో యాక్ట్ చేసిందా? అని ఆత్ర పడిపోకండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది.. సన్నీ చాలా సరదాగా ఓ చిన్నారితో ఆడుకొంటున్న వీడియో గురించి. ఆ చిన్నారికి ఓ నాలుగైదేళ్ళు ఉంటాయనుకోంటా.. సన్నీ చంకనేక్కింది. సన్నీ నచ్చిందో లేక ఆమె లాలింపు నచ్చిందో తెలియదు కానీ..
ఆమె తల్లిదండ్రులు వచ్చి దిగమని చెప్పినా “నేను దిగను” అంటూ మారాం చేస్తూ సన్నీని గట్టిగా పట్టుకొని కూర్చోంది. చూడ్డానికి ఎంతో ముద్దుగా అనిపించిన ఈ తాజా వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో సంచలనం సృష్టిస్తోంది. సన్నీని కేవలం శృంగార తారగానే చూసేవారందరికీ ఈ సరికొత్త వీడియో సన్నీలియోన్ లోని మరో యాంగిల్ ను పరిచయం చేసింది. మనం ఇప్పటివరకూ ఆమెను సెక్స్ సింబల్ గా చూశాం కానీ.. సన్నీలోని ఈ తాజా యాంగిల్ ను చూస్తుంటే ముచ్చటేస్తోంది!
Haha she didn’t want to leave me…so cute!! pic.twitter.com/KvaRl6JB5F
— Sunny Leone (@SunnyLeone) August 20, 2016














