దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులకు విలన్ గా సుపరిచితమైన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. వలస కార్మికులు, పేదలకు సోనూసూద్ చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు. సేవా భావంతో ఏమీ ఆశించకుండా కష్టాల్లో ఉన్న ఎంతోమందిని సోనూసూద్ ఆదుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఇప్పటికీ పేద ప్రజలకు తన వంతు సహాయం చేస్తూ సోనూసూద్ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి సోనూసూద్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.
సోనూసూద్ పేదలకు చేసిన సహాయాల వల్ల దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగుతోంది. అయితే కొంతమంది సైబర్ మోసగాళ్లు సోనూసూద్ పేరును ఉపయోగించుకుని ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారు. సోనూసూద్ ద్వారా సహాయం అందేలా చేస్తామని ప్రకటనలు ఇస్తూ అమాయకులైన ప్రజల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులను వసూలు చేస్తున్నారు. సోనూసూద్ ట్విట్టర్ ద్వారా ఈ మోసాల గురించి తెలియజేస్తున్నా నిరక్ష్యరాస్యులైన వాళ్లు సరైన అవగాహన లేకపోవడంతో ఈ మోసాల బారిన పడుతున్నారు.
అశిష్ కుమార్ అనే వ్యక్తి సోనూసూద్ కార్పొరేట్ కార్యాలయం పేరును వినియోగించుకుని అకౌంట్ క్రియేట్ చేసి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. సహాయం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని అమాయకులను అశిష్ నమ్మించాడు. బీహార్ కేంద్రంగా ఈ మోసం జరగగా బాధితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అశిష్ కుమార్ ను అరెస్ట్ చేయడంతో అతని బాగోతం బట్టబయలైంది. మోసగాళ్లు చేస్తున్న మోసాలు సోనూసూద్ కు చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా ఉండటం గమనార్హం. సోనూసూద్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!