Rashmika: ఆ అవార్డు మా హీరోయిన్ కే సొంతమంటున్న ఫ్యాన్స్!

కిరాక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక. తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా తన హవా కొనసాగిస్తోంది. చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం తన కెరియర్ ఫుల్ బిజీగా ఉంది.

చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయిన జాబితాలో రష్మిక ముందుంటారు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన చలాకీ తనం, నటనతో అక్కడ క్రేజ్ సొంతం చేసుకుని వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఓ వార్త విన్న రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. రష్మిక కొన్ని ఫిలింఫేర్, సైమ అవార్డులను సాధించింది. ఇప్పుడు రష్మిక ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం. ఉత్తమ ఆసియా నటి విభాగం నుంచి రష్మిక పేరు సేఫ్టీఎస్ అవార్డుకు ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విభాగంలో రష్మికకు (Rashmika)  గట్టి పోటీ కూడా ఉన్నట్లు సమాచారం. కానీ పలువురు నెటిజన్, ఆమె అభిమానులు మాత్రం రష్మిక కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఈ అవార్డు కోసం దాదాపు ఎనిమిది మంది నటీమణులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ఆసియా దేశాల నుంచి హీరోయిన్లు కూడా ఈ అవార్డు కోసం బరిలో ఉన్నారని సమాచారం. ఇదే విభాగంలో నుంచి ఇండియాకు చెందిన నమిత లాల్ కూడా నామినేట్ అయ్యారు.

నమిత లాల్ నిర్మాతగా కూడా బాగా పాపులర్. అలాగే మలయాళ నటుడు టోవినో థామస్ ఉత్తమ ఆసియా నటుడిగా నామినేట్ అయ్యాడు. ప్రముఖ హిందీ యూట్యూబర్ భువన్ బాంబు కూడా ఓ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. ఉత్తమ ఆసియా చిత్రాల జాబితాలో మలయాళ చిత్రం 2018 కూడా నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus