గతేడాది దసరా పండుగకు మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడి సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలలో మహాసముద్రం మినహా మిగిలిన రెండు సినిమాలు సక్సెస్ సాధించాయి. దసరా సీజన్ తర్వాత సంక్రాంతి సీజన్ సినిమాల విడుదలకు అనుకూలం కాగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో సూపర్ మచ్చి డిజాస్టర్ కాగా మిగిలిన సినిమాలు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నాయి.
బంగార్రాజు మాత్రమే కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండగా రౌడీ బాయ్స్, హీరో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే హీరో సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా ఏకంగా 9.2 ఐఎండీబీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం సాధ్యం కాని స్థాయిలో ఈ సినిమా రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. గల్లా అశోక్ తొలి సినిమాతోనే ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా 20 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. వచ్చే నెల 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కృష్ణ హిట్ పాటలలో ఒకటైన జుంబారే పాటను రీమిక్స్ చేశారు. ఈ సినిమా రోలింగ్ టైటిల్స్ లో వచ్చే బుర్ర పాడౌతాదే పాట రెండు కోట్ల రూపాయలతో తెరకెక్కిందని తెలుస్తోంది.
అయితే కథాగమనానికి అడ్డుగా ఉందని ఈ పాటను రోలింగ్ టైటిల్స్ లో పెట్టారని సమాచారం. కమర్షియల్ గా హీరో మూవీ సక్సెస్ కాకపోయినా గల్ల అశోక్ కు నటుడిగా ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!