Atlee: ప్రియమణిని మాత్రమే కాదు ‘జవాన్’ డైరెక్టర్ ఆమెను కూడా మోసం చేశాడట!

షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో ‘జవాన్’ అనే సినిమా వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. ‘గదర్ 2 ‘ కలెక్షన్స్ ను ‘జవాన్’ మూవీ ఈజీగా బ్రేక్ చేస్తుంది అని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు అట్లీ ‘జవాన్’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించాడు అనేది వాస్తవం. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన ప్రియమణి..

అట్లీ (Atlee) ఓ విషయంలో మోసం చేశాడని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ‘జవాన్’ మూవీ తమిళ్ వెర్షన్ లో విజయ్, తెలుగు వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ చేస్తారని అట్లీ చెప్పాడట. ఈ టాక్ విని ప్రియమణి విజయ్ తో నటించొచ్చు అని ఆశపడి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే విజయ్, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని ఆమె అట్లీ పై సెటైర్లు వేసింది. ప్రియమణిలానే మరో నటిని కూడా అట్లీ మోసం చేశాడట.

ఆమె మరెవరో కాదు ‘రాజా రాణి’ ఫేమ్ సాక్షి అగర్వాల్. ఆమె మాట్లాడుతూ.. ” ‘రాజా రాణి’ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం నన్ను ఎంపిక చేసుకున్నారు. కొన్ని సెకన్ల పాటు కనిపించే సీన్‌ కాబట్టి..నాకు స్టోరీ చెప్పలేదు.సినిమా విడుదలయ్యాక నా పాత్ర వచ్చి వెళ్లిన తీరు చూసుకుని చాలా బాధపడ్డాను. సీన్‌ కాంటెక్ట్స్‌ ఏంటన్నది వివరించకుండా కొత్త వాళ్లకు ఇలాంటి పాత్రలు ఇస్తుంటారు డైరెక్టర్లు. వాళ్ళతో నటీనటులకు అందుకే గొడవలు వస్తుంటాయి” అంటూ సాక్షి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus