పాతిక లక్షల విషయంలో బండ్ల గణేష్ కొరటాల మధ్య ఇంత గొడవ జరిగిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటిస్తూ అనంతరం నిర్మతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బండ్ల గణేష్ ఒకరు ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఈయనకు ఉన్నఫలంగా ఇంత డబ్బు ఎలా వచ్చింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈయన అప్పట్లో ఉన్నటువంటి మంత్రికి బినామీగా కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈయన సినిమాలలోకి రాకముందే మంచి ఆస్తిపరుడు అనే విషయం చాలా మందికి తెలియదు.

ఇక ఈయన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. ఇక ఈయనకు గబ్బర్ సింగ్ సినిమా ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఈయన స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. ఇక ఎన్టీఆర్ హీరోగా టెంపర్ సినిమాకు ఈయన చివరిగా నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ దర్శకుడు కొరటాల శివ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బండ్ల గణేష్ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని బండ్ల గణేష్ ముందుగానే కొరటాల శివకు 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన దీంతో కొరటాల శివ 25 లక్షలు బండ్ల గణేష్ కు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ విషయంలోనే ఇద్దరికీ గొడవ జరిగిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇలా ఈ వార్తలు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను కొరటాల శివకు 25 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమేనని అయితే ఆయన సినిమా ఆగిపోవడంతో తనకు తిరిగి వెనక్కి ఇవ్వలేదని తెలిపారు డబ్బు ఇవ్వకపోయినా మా మధ్య ఎలాంటి గొడవలు లేవు కానీ కొరటాల ఎప్పటికైనా తనకు సినిమా చేస్తానని చెప్పారు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus