Ravali: సీనియర్ హీరోయిన్ రవళి కెరీర్ అలా దెబ్బతిందట..!

Advertisement

ఒకప్పటి హీరోయిన్ రవళి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె అసలు పేరు శైలజ.. అయినప్పటికీ సినిమాల్లోకి వచ్చాక రవళిగా పేరు మార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ ఈమె సొంత ఊరు. ఈమె తల్లి విజయ దుర్గ కూడా నటే..! ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రవళి కెరీర్ గురించి చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్ గా చేసింది.

పొట్టిగా ఉందంటూ ఆమెకు చెల్లెలి పాత్రలు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై రాణిస్తోంది. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో పారితోషికం అందుకుంది. ఆమె ఇమేజ్ కూడా పెరిగింది. కెరీర్ ఊపులో ఉన్న టైంలో రవళి లావైపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైపోయింది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు తనకు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామని డిసైడ్ అయ్యింది.

ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు దూరమైంది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది’ అంటూ రవళి తల్లి విజయ దుర్గ చెప్పుకొచ్చింది. ‘పెళ్ళిసందడి’ కి ముందు అనేక సినిమాల్లో నటించిన రవళి.. వాటితో పెద్దగా పాపులర్ కాలేకపోయింది. అయితే ‘పెళ్ళిసందడి’ తర్వాత ‘వినోదం’ ‘శుభాకాంక్షలు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus