Yatra2: యాత్ర2 మూవీకి సంబంధించి షాకింగ్ అప్ డేట్.. ఏమైందంటే?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన కథతో మహి వి రాఘవ్ డైరెక్షన్ లో యాత్ర పేరుతో తెరకెక్కిన సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర2 సినిమా తెరకెక్కుతుండగా జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ అనే సంగతి తెలిసిందే.

ఈ బ్యానర్ లో యాత్ర2 తెరకెక్కిస్తే ఈ సినిమా హాట్ టాపిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2024 ఎన్నికల సమయానికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యాత్ర2 మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని సమాచారం అందుతోంది. యాత్ర2 సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. యాత్ర2 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది.

యాత్ర2 (Yatra2) మూవీకి సంబంధించి అతి త్వరలో అధికారికంగా మరిన్ని మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయి. యాత్ర2 మూవీ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో సైతం రాజీ పడరని తెలుస్తోంది. యాత్ర2 సినిమా వైసీపీ పార్టీ ప్రచారానికి ఉపయోగపడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యాత్ర2 సినిమాలో మమ్ముట్టి పాత్ర ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. యాత్ర2 మూవీ వైసీపీకి ప్లస్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. మహి వి రాఘవ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో ఒకరు కాగా ఈ దర్శకునికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus