2024 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాని ప్రేక్షకులు అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ కూడా కామన్ ఆడియన్స్ రిలేట్ చేసుకునే విధంగా దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రాన్ని మలిచాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి పాత్ర ఆడియన్ కి కనెక్ట్ అవుతుంది. హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మాత్రమే కాదు ఈ సినిమాలో అన్ని పాత్రలు ముఖ్యమే.
బ్యాంక్ ఎంప్లాయ్ గా చేసిన శివన్నారాయణ నుండి సూరజ్ పాత్ర వరకు.. అలాగే హీరో తండ్రి ప్రహ్లాద్ పాత్ర పోషించిన సర్వధామన్ డి బెనర్జీ (Sarvadaman D. Banerjee ) పాత్ర కూడా చాలా కీలకమైనది అని చెప్పాలి. సర్వధామన్ డి బెనర్జీ (Sarvadaman D Banerjee) తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్వయం కృషి’ (Swayam Krushi) అలాగే ‘సిరివెన్నెల’ వంటి సినిమాల్లో ఈయన నటించారు. 2022 లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ లో (Godfather) కూడా తండ్రి పాత్ర పోషించారు.
ఇక ‘లక్కీ భాస్కర్’ లో హీరో తండ్రి పాత్ర పోషించారు. సినిమా క్లైమాక్స్ లో హీరో చేసిన స్కామ్స్ నుండి అతన్ని బయటపడేయడం కోసం… సలహాలు ఇచ్చే టైంలో ఆర్.బి.ఐ ఆఫీసర్ తన ఫ్రెండ్ అంటూ ఇచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్ కి థియేటర్లు షేక్ అయ్యాయి. ఆ తర్వాత ఆ ఆర్.బి.ఐ ఆఫీసర్ గా చేసిన నటి కళ్యాణి రాజ్ కూడా ‘నువ్వు మా ప్రహ్లాద్ కొడుకువా.. మొన్నామధ్య ఎక్కువగా గుర్తొచ్చారు’ అంటూ పలుకుతుంది.
దీంతో అప్పటి వరకు సైలెంట్ గా సినిమా చూస్తున్న ఆడియన్స్ సర్వధామన్ ఎక్స్ప్రెషన్ తో జోష్ తో అరిచారు. ఈ సీన్ కి చాలా మీమ్స్ వచ్చాయి. మరోపక్క సర్వధామన్ (Sarvadaman D Banerjee) వయసు ఇప్పుడు 60 ఏళ్ళు. అయినప్పటికీ అతని ఫిజిక్ చూస్తే మతిపోవడం ఖాయం. ఫిట్ గా ఉండటమే కాదు కండలు తిరిగిన దేహంతో కనిపించి అందరికీ షాకిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ మీమ్ ను నటి కళ్యాణి రాజ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది.