విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని అంత ఈజీగా ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని బుల్లితెర పై చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదలైంది.
22 ఏళ్ళు పూర్తి కావస్తోన్నప్పటికీ ప్రేక్షకులకు ఈ మూవీ ఓ ఎడిక్షన్. రిమోట్ లు పక్కన పెట్టేసి మరీ ఈ సినిమాని చూస్తూ మైమరచిపోయే జనాలు కూడా ఇప్పుడున్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అయితే ఎన్ని సార్లు నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూసినప్పటికీ ఇప్పటికీ జనాలు కనిపెట్టలేని మిస్టేక్ ఒకటి ఉంది.అదేంటి అంటే..సినిమా స్టార్టింగ్ లో హీరోకి వాళ్ళ నాన్న ఉత్తరం రాసినప్పుడు.. అది హీరోయిన్ అలాగే ఆమె చెల్లెలు పింకీ చదువుతారు.
ఆ తర్వాత హీరోని కలుసుకోవడానికి వెళ్తారు. అప్పుడు పింకీ…తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నానని చెబుతుంది. అయితే నెక్స్ట్ సీన్ లో పింకీ స్కూల్ కి వెళ్లే టైం లో కొంతమంది స్టూడెంట్స్ ఆమెను ఏడిపిస్తారు . అప్పుడు హీరో వెంకీ వచ్చి వాళ్ల భరతం పట్టి..పింకీ ని స్కూల్ బస్ లో ఎక్కించి పంపిస్తాడు.అయితే స్కూల్ బస్ పై B.V.B.P SCHOOL అని ఉంటుంది. మరి పింకీ లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ అని ఎందుకు చెప్పింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!