Sarkaru Vaari Paata Movie: ‘సర్కారు వారి పాట’ టీం సడెన్ సర్ప్రైజ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 2022 సంక్రాంతి రేసులో జాయిన్ కాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవ్వడంతో.. ఈ సారి పోటీ, 2020 ని మించి ఉండబోతుందని స్పష్టమవుతుంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.’మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ కొత్తగా ఉండబోతుంది అనే విషయం అభిమానులకి ఎప్పుడో అర్ధమైంది. లాంగ్ హెయిర్ తో మహేష్ సరికొత్తగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూలై 31న విడుదల చేయబోతున్నారట చిత్ర యూనిట్ సభ్యులు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం వారు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.’సూపర్ స్టార్ ఫస్ట్ నోటిస్’ పేరుతో ఈ ఫస్ట్ లుక్ విడుదల కాబోతుంది. నిజానికి మే 31న కృష్ణగారి పుట్టినరోజు నాడే ఈ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వలన చిత్ర బృందం అప్పుడు విడుదల చేయలేకపోయింది.మహేష్ బాబు పుట్టినరోజు ఆగష్ట్ 9న ఉండడంతో.. సెకండ్ నోటీస్ కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.అయితే ‘సర్కారు వారి పాట’ టీం ఇలా సడెన్ సర్ప్రైజ్ ఇస్తారని ఊహించలేదు’ అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు సంబరపడిపోతూ కామెంట్స్ పెడుతుండడం విశేషం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus