కన్నడ చిత్ర పరిశ్రమ ఇద్దరు సాహస నటులను కోల్పోయింది. వారి మరణం శాండల్‌వుడ్ ను విషాదంలో ముంచింది. దక్షిణాది సినీ పరిశ్రమాలన్నింటినీ కలిచి వేసిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కన్నడలో ‘మస్తిగుడి’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాన్ని మాగడి తాలూకా లోని తిప్పగొండనహల్లి అనే ప్రాంతంలో పెద్ద రిజర్వాయర్ వద్ద చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. స్టంట్ డైరక్టర్ రవివర్మ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సీన్ లో అనుకున్న ప్రకారం హీరో విజయ్‌తో పాటు విలన్ పాత్రల్లో నటిస్తున్న మరో ఇద్దరు నటులు అనిల్, ఉదయ్‌లు కలిసి హెలికాప్టర్ నుండి రిజర్వాయర్‌లో దూకారు.
నీటిలో పడిన అనిల్, ఉదయ్ లు బయటికి రాలేదు. విజయ్ ని అతి కష్టం మీద రక్షించ గలిగారు. విలన్ పాత్ర దారుల ఆచూకీ లభించలేదు. వారి మరణానికి స్టంట్ డైరక్టర్ రవివర్మ నిర్లక్షమే ప్రధాన కారణమని అందరూ విమర్శిస్తున్నారు. కనీస ముందు జాగ్రత్తలు పాటించలేదని ఆరోపిస్తున్నారు. మునిగిపోతున్నప్పుడు హెలికాఫ్టర్ తో తాడు పంపించే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధిచెందినా ఇటువంటి సాహసం అవసరమా? అని బాలీవుడ్ కు చెందిన రిషి కపూర్ ప్రశ్నిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో మాస్తిగుడి చిత్రం యూనిట్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తరికెరె పోలీసులు ప్రకటించారు.
Rest in peace https://t.co/aXWqA0ixxg
— Nivetha Thomas (@i_nivethathomas) November 8, 2016