Suriya: సూర్య సినిమాకు మరో వెరైటీ టైటిల్‌… ఎవరూ ఊహించని స్టైల్‌లో!

Advertisement

‘కంగువ’ (Kanguva)  నుండి వేగంగా కోలుకున్న సూర్య  (Suriya)  వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. వాటి అప్‌డేట్‌లు కూడా వేగంగా ఇస్తున్నాడు. కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj)  సినిమాను ‘రెట్రో’ అంటూ అనౌన్స్‌ చేశాడు. ఆర్జే బాలాజీ సినిమా అప్‌డేట్‌లు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఆ తర్వాతి సినిమా ఏంటి అనే విషయంలోనూ చిన్న క్లారిటీ వచ్చింది. తాజాగా ఆ సినిమా పేరు అంటూ ఓ టైటిల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్జే బాలాజీ సినిమా తర్వాత సూర్య..

Suriya

మన వెంకీ అట్లూరి (Venky Atluri)   డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తారు అని ఇప్పటికే వార్తలొచ్చాయి. సూర్య 46వ సినిమాగా తెరకెక్కునున్న ఈ చిత్రం మారుతి కారు నేపథ్యంలో సాగుతుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మారుతి కారును కథా వస్తువుగా ఎంచుకున్నారట వెంకీ అట్లూరి. మారుతి కారు మన దేశానికి ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే అంశాలతో వెంకీ అట్లూరి కథ సిద్ధం చేసుకున్నారట.

మరి ఈ చరిత్రను ఎలా చూపిస్తారు అనేది చూడాలి. ఆ సినిమాకు ‘796 CC’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. 796 CC ఇంజిన్‌తోనే మారుతి కార్లు ఇండియా మార్కెట్‌లోకి వచ్చాయి. ఆ తర్వాత ఇండియన్ ఆటో మెబైల్ ఇండస్ట్రీలో మారుతి కార్లు గేమ్ ఛేంజర్‌గా మారాయి. గతంలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ‘డెక్కన్‌ ఎయిర్‌లైన్స్‌’ ఫౌండర్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాన్ని చూపించారు. ఇప్పుడు మారుతి కారు గురించి చెప్పబోతున్నారు.

మరి ఈ సినిమా సూర్యకు ఎంతటి పేరు తీసుకొస్తుందో చూడాలి. ఎందుకంటే ‘సూరరై పొట్రు’ / ఆకాశం నీ హద్దురా’కు విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నాడు సూర్య. ఇక వెంకీ అట్లూరి సంగతి చూస్తే.. పరభాషా హీరోలను బాగా హ్యాండిల్‌ చేస్తారని పేరు. ‘సార్‌’తో (Sir) ధనుష్‌ (Dhanush)’ , ‘లక్కీ భాస్కర్‌’తో  (Lucky Baskhar)  దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) మంచి విజయాలు అందుకున్నారు. ఇక సూర్యకు కూడా ఓ మంచి విజయం అందిస్తే సరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news