టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగ చైతన్య త్వరలో భార్యాభర్తలు కానున్నారు. అక్టోబర్ 6 నుండి 9 వరకు వీరి పెళ్లి గోవా లో వైభవంగా జరగనుంది. ప్రేమ ఇద్దరి మనసులమధ్య పుట్టేది అయితే.. పెళ్లి రెండు కుటుంబాల మధ్య జరిగే వేడుక. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఈ జంటను శ్రీరామా రక్ష. అందుకేనేమో నాగ చైతన్య అమ్మమ్మ (దగ్గుబాటి రామానాయుడు సతీమణి రాజేశ్వరి ) చీరను సమంతకు కట్టించి పెళ్లి పీటలపై కూర్చోబెట్టనున్నట్లు తెలిసింది. ఈ పెళ్ళికి అన్ని చీరలు, డ్రసులను డిజైన్ చేస్తున్న డిజైనర్ క్రేశ బజాజ్ అలనాటి చీరకు నేటి సొగసులు అద్దుతున్నారు.
అత్యంత విలువైన స్టోన్స్ తో డిజైన్స్ చేస్తున్నారు. ఇక క్రేశ భర్త వనరాజ్ సమంత ధరించనున్న నగలను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. డైమండ్స్, బంగారం కుందన్ తో తయారు చేసిన నగలుతో సమంత పెళ్లి రోజు ధగధగా లాడనుంది. ముందు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనున్న సమంత,నాగచైతన్య .. తర్వాత క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జీసెస్ ఎదుట ఉంగరాలు మార్చుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.