‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Advertisement

‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి వరుస పరాజయాలతో రేసులో వెనక్కి పడ్డ శర్వానంద్ ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని డిసైడ్ అయ్యి చేసిన మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శ‌ర్వానంద్‌ కు జోడీగా ర‌ష్మిక మందన్న న‌టించగా…. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మార్చి 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి, టీజర్, ట్రైలర్లు అన్నీ ప్రామిసింగ్ గా ఉండడంతో శర్వానంద్ గత ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా మంచి బిజినెస్ జరిగింది.

ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 5.20 cr
సీడెడ్ 2.20 cr
ఉత్తరాంధ్ర 1.80 cr
ఈస్ట్ 1.10 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 1.28 cr
కృష్ణా 0.92 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.00 cr

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. సినిమా పై మంచి బజ్ ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఇంకా స్వింగ్ లోనే ఉంది. మరో పక్క ‘సెబాస్టియన్’ కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి. మరి అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news