Sharwanand, Rashmika: శర్వానంద్ పెళ్లి కష్టాలు.. టీజర్ చూశారా..?

Advertisement

శర్వానంద్‌కు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. ఆయన నటిస్తోన్న సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్ టాక్ వస్తుంది. ‘శ్రీకారం’, ‘మహా సముద్రం’ సినిమాలు కూడా ఫ్లాప్‌గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జాను’ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తాజాగా ఈ హీరో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

Click Here To Watch

కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘పెళ్లి అయినా, పండగ అయినా, మన ‘చిరు’ జీవితం అయినా… సందడి అంతా ఆడవాళ్లదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చి సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు శర్వానంద్.

‘ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో పది మంది ఆడాళ్లు ఉండి పెళ్లికి ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇంట్లో ఆడాళ్ల కారణంగా హీరోకి ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ అవుతుంటాయి. అలాంటి హీరో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా చనువుగానే ఉంటుంది. కానీ పెళ్లికి మాత్రం ఒప్పుకోదు. ఆ తరువాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.

ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక శ‌ర‌త్ కుమార్‌, ఖుష్బూ, ఊర్వ‌శి త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news