సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి నటుడిగా ఎంత మంచి క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక నేచురల్ పక్కింటి అబ్బాయిలనే కాకుండా భయంకరమైన విలన్ గా కూడా సత్తా చాటుకున్నాడు. హీరోగా క్లిక్కవ్వాలని అనుకున్న ఆది అంతగా క్లిక్కవ్వలేదు. కానీ ఒక నటుడిగా మాత్రం ప్రేక్షకులను అన్ని రకాలుగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా రంగస్థలం వంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో సినిమాలకు బాగా హెల్ప్ అవుతున్నాడు.
ఇక చాలా రోజుల అనంతరం ఆది పినిశెట్టి హీరోగా హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు 2017లో మరకతమణి అనే ఫాంటసీ కామెడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా మరో సీక్వెల్ తో రెడీ అవుతున్నాడు. స్టోరీ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్టును ఇన్ని రోజులు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాల్సి వచ్చింది.
ఇక లాక్ డౌన్ అనంతరం వెంటనే తెలుగు తమిళ్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి మరికొంత బడ్జెట్ ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆది ఈ సినిమాతో సోలో హీరోగా బిగ్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.