రంగస్థలం 1985 లో చరణ్ తో పోటీ పడనున్న ఆది!

  • November 30, 2017 / 09:30 AM IST

ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం 1985” సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్టూడియోలో 5 కోట్లతో వేసిన  గ్రామీణ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. చరణ్,  హీరోయిన్ సమంతతో పాటు సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ విషయం బయటికి వచ్చింది.

ఇందులో ఆది చరణ్ కి సోదరుడిగా నటిస్తున్నారంట. చరణ్ పై ఈర్షతో రగిలిపోయే పాత్రలో ఆది కనిపించనున్నారు. అయితే ఈ రోల్ ని సుకుమార్ ని చాలా డిఫెరెంట్ గా మలిచారని చిత్ర బృందం తెలిపింది. ముఖ్యంగా చరణ్, ఆది మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశం చాలా నేచురల్ గా ఉంటుందని స్పష్టం చేసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలిసారి చరణ్, సమంత కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus