సీవీ రెడ్డి దర్శకత్వంలో ‘ఆఖరి ముద్దు’

నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి త్వరలో ఓక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలోచింపజేసే కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమాను సీ, వి. రెడ్డి ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఈ సినిమా కథను తయారు చేసుకున్న సీవీ రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. ఈ కథ తనని బాగా ప్రభావిత చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని, డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సీవీ రెడ్డి తెలిపారు . గతంలో సీవీ రెడ్డి తెలుగులో పది చిత్రాలు, కన్నడ, తమిళం లో అనేక చిత్రాలు నిర్మించారు… దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మిచారు… ‘బదిలి’ అనే చిత్రం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు స్వీకరించారు.

‘పెళ్లి గోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను సివి. రెడ్డి నిర్మించారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబెర్ గా, ప్రతిష్టాత్కమైన ఆస్కార్ కమిటీకి చైర్మన్ గా గౌరవ ప్రదమైన సేవలందించారు. ‘ఆఖరి ముద్దు’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు, దర్శకత్వం వహిస్తూ తానె స్వయంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus