Aamir Khan, Prabhas: ‘ఆది పురుష్’ వాయిదా… కన్ఫర్మ్ చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ యూనిట్..!

  • February 15, 2022 / 05:50 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ మూవీని ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది.ప్రస్తుతం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ నడుస్తుంది. ఇది మరో 3 నెలల పాటు ఉంటుంది. అటు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ప్రభాస్ హిందీలో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.

Click Here To Watch

నిజానికి ఈ చిత్రాన్ని ఆగష్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ‘ఆది పురుష్’ వాయిదా పడినట్టు ప్రకటన వచ్చింది.అది కూడా ఆమిర్ ఖాన్ సినిమా యూనిట్ నుండి కావడం విశేషం. అదేంటి ప్రభాస్ సినిమాకి.. ఆమిర్ ఖాన్ సినిమాకి సంబంధం ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. వివరాల్లోకి వెళ్తే… ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం మొదట ఏప్రిల్ 14న విడుదల కాబోతుందని ప్రకటించారు.

కానీ ఆ టైంకి ‘కె.జి.ఎఫ్2’ ‘బీస్ట్’ వంటి పెద్ద చిత్రాలు కూడా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. దాంతో ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా పోటీ నుండీ తప్పుకుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్ట్ 11న అంటే ‘ఆది పురుష్’ టీం అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కు రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ‘ఆది పురుష్’ నిర్మాతలకి దర్శకుడికి స్పెషల్ థాంక్స్ కూడా చెప్పింది ‘లాల్ సింగ్ చద్దా’ యూనిట్. అయితే ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus