Abbas: ఆ అమ్మాయి వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నాను… అబ్బాస్ కామెంట్స్ వైరల్!

ప్రేమదేశం సినిమా ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అబ్బాస్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఒకానొక సమయంలో ఈయన వరుస పరాజయాలను చూస్తూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇండస్ట్రీకి దూరమైనటు వంటి ఈయన న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. ఇలా కుటుంబ పోషణ కోసం ఒకానొక సమయంలో బైక్ మెకానిక్ అలాగే ట్యాక్సీ డ్రైవర్ గా కూడా పనిచేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అబ్బాస్ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం కావడానికి అలాగే ట్యాక్సీ డ్రైవర్ గా పని చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి తాజాగా ఈయన తెలియజేశారు.

చాలా రోజుల తర్వాత అబ్బాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. తాను పదవ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు 10వ తరగతి ఫెయిల్ కావడంతో తాను ప్రేమించిన అమ్మాయి కూడా తనకు దూరమైందని ఆ సమయంలో ఎంతో డిప్రెషన్ కి గురైనటువంటి తాను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఒకరోజు రోడ్డు పక్కన నిలబడి వేగంగా వస్తున్నటువంటి వాహనం మీద దూకాలని నిర్ణయించుకున్నాను అయితే ఆ డ్రైవర్ గురించి ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు.

నాకు తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాను. ఇలా సినిమా సక్సెస్ కావడంతో నాకు ఉన్నటువంటి అభిమానులను చూసి ఆశ్చర్యపోయాను అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలు కోల్పోయాను. అవకాశాలు లేకపోవడంతో చివరికి తనకు నటన పైనే విరక్తి కలిగిందని అందుకే తాను ఇండస్ట్రీకి కూడా దూరమయ్యానని తెలిపారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమై న్యూజిలాండ్లో స్థిరపడ్డానని అక్కడ కుటుంబ పోషణ భారమైన తరుణంలో బైక్ మెకానిక్, టాక్సీ డ్రైవర్ గా సిరపడ్డానని తెలిపారు. అయితే తాను తిరిగి సినిమా ఇండస్ట్రీలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా (Abbas) అబ్బాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus