కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ చర్చ ఇప్పటిది కాదు. టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న డిస్కషన్ ఇది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేసరికి ఈ చర్చ పెరిగి పెద్దదైంది. ఓవైపు సినిమా తొలి దర్శకుడు నవీన్ మేడారం, మరోవైపు తొలి నిర్మాత… ఇప్పటి దర్శకనిర్మాత అయిన అభిషేక్ నామా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తొలుత నవీన్ ప్రారంభిస్తే… దానికి అభిషేక్ ఆన్సర్ ఇచ్చారు.
‘కల్యాణ్ రామ్’ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తన పేరును చూపించడకుండా పక్కనపెట్టేశారు అంటూ నవీన్ మేడారం సోషల్ మీడియాలో పెద్ద పోస్టు ఒకటి పెట్టారు. దానికి నిర్మాత కమ్ దర్శకుడు అభిషేక్ నామా ఓ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ చర్చ సోషల్ మీడియాలో తాజాగా మళ్లీ మొదలైంది. ఈ సినిమా ప్రాజెక్ట్‌ను నవీన్ హ్యాండిల్ చేయలేకపోయారని అందుకే తీసేశాం అని అభిషేక్ చెప్పారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైన రెండో రోజే ఈ సినిమాను నవీన్ హ్యాండిల్ చేయలేరని అర్థమై… తాను దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అభిషేక్ తెలిపారు. అయితే నవీన్ మాత్రం తాను ఈ సినిమా కోసం 105 రోజులు పని చేశాను అని చెప్పడం గమనార్హం. సినిమాకు తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకపోవడం బాధగా ఉందని నవీన్ పేర్కొన్నారు.
ఎవరు ఎన్ని చెప్పినా (Devil) ‘డెవిల్’ నేను దర్శకత్వం వహించిన సినిమా. అది నా బిడ్డతో సమానం. ఇప్పటివరకూ నేను మౌనంగానే ఉన్నా. నా మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ఈ సినిమాను తెరకెక్కించడంలో నేనెలాంటి తప్పు చేయలేదు. దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది అని నవీన్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. అయితే అభిషేక్ అలా స్పందించడంతో ఈ విషయం ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!