మెహబూబ్ సైగలపై అభిజీత్ సెన్సేషనల్ కామెంట్స్..!

సోషల్ మీడియాలో ఇప్పుడు మెహబూబ్ చేసిన సైగలు హాట్ టాపిక్ గా మారాయి. శనివారం ఎపిసోడ్ లో మెహబూబ్ సోహైల్ కి మూడూ అంటూ చేతులతో చేసిన సైగలు అందరికీ షాక్ ఇచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ టైమ్ లో విన్నర్ అయిన అభిజీత్ దీనిపై కామెంట్స్ చేశాడు.

మెహబూబ్ రీయూనియన్ లో వచ్చినపుడు డబ్బులు తీస్కోమని, నువ్వు మూడో ప్లేస్ లో ఉన్నావని సైగ చేయడం అనేది నాకు అస్సలు తెలీదని చెప్పాడు అభిజీత్.సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసిన తర్వాతే తెలిసిందని, దీనిపై నేను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని, ఏదైనా తప్పు జరిగి ఉంటే, అది స్టార్ మా చూస్కుంటుందని చెప్పాడు. అంతేకాదు, రీ యూనియన్ అప్పుడు చాలా విషయాలు మాట్లాడారు అని, ఈ విషయం మాత్రం నేను నోటీస్ చేయలేదని చెప్పాడు అభిజీత్.

నేను ఎప్పుడూ ప్రైజ్ మనీ గురించి పట్టించుకోలేదు. బిగ్ బాస్ టైటిల్ కోసమే గేమ్ ఆడామ్ కానీ, మనీకోసం కాదని, నిజంగా నాకు ఆడియన్స్ నుంచి లభించిన ప్రేమ అనేది వెలకట్టలేనిదని చెప్పాడు. ఈ విషయంపై అభిజీత్ ఇచ్చిన ఆన్సర్ కి నెటిజన్స్ , ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. అదీ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus