కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త కంట్రోల్‌లోకి రావడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ క్రమంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. దీనికి సంబంధించి దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారట. ఆయన వేసుకున్న ప్రణాళిక ప్రకారం… ఈ నెలాఖరుకు చిత్రీకరణ పూర్తయిపోతుంది. షూటింగ్ ఇంకా 12 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పరిస్థితులు బాగుండుంటే… ‘ఆచార్య’ విడుదలై ఇప్పటికి చాలా రోజులు అయి ఉండేది.
కానీ ఏం చేస్తాం… ‘కరోనా’ రాసిన రాత అలా ఉంది. సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న 12 రోజుల్లో ఎనిమిది రోజులు చరణ్ అండ్ టీమ్ మీద, నాలుగు రోజులు చిరంజీవి మీద సీన్స్ తీస్తారని సమాచారం. చరణ్‌తో చేసే ఎనిమిది రోజుల షూటింగ్‌లో ఒక పాట కూడా చిత్రీకరిస్తారని టాక్. దీని కోసం చాలా రోజుల క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సెట్ కూడా వేశారు. వీలైనంత త్వరగా ఈ బ్యాలెన్స్ షూట్, ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేసుకొని…
సినిమా విడుదల చేయాలని ‘ఆచార్య’ టీమ్ అనుకుంటోందట. ఇటీవల వచ్చిన టాక్ ప్రకారం అయితే… దసరా సందర్భంగా సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. అంతకంటే ముందే సినిమా రెడీ అయిపోతే… వేరే తేదీ విషయంలో ఆలోచిస్తారేమో చూడాలి. అయితే థర్డ్ వేవ్ సూచనలు ఉన్న నేపథ్యంలో ఎంత త్వరగా సినిమా రెడీ చేసి, రిలీజ్ చేసుకుంటే అంత బెటర్.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!