Acharya Movie: చిరు, రామ్ చరణ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో..?

  • August 14, 2021 / 11:48 AM IST

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మాత్రమే ఎవరికీ తెలియదు. నిజానికి కొరటాల శివ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆయనకంటే ముందే పవన్ కళ్యాణ్ సినిమా దర్శకనిర్మాతలు డేట్ అనౌన్స్ చేశారు. అంతేకాదు.. సినిమా నుండి అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టేశారు. అయినప్పటికీ ఎలాగోలా చిరంజీవిని ఒప్పించి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు కొరటాల శివ.

నిజానికి అక్టోబర్ బరిలో సినిమాను విడుదల చేయొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్న డేట్ కి రాదని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేయకుండా చిరు మరో సినిమాను మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాట, కొన్ని సీన్లు ఉన్నాయి. అవన్నీ సెప్టెంబర్ లో చిరు, చరణ్ లు ఇచ్చే డేట్ లను బట్టి పూర్తి చేయాల్సివుంటుంది.

మరి ‘లూసిఫర్’ రీమేక్ మీదకు వెళ్లిపోయిన మెగాస్టార్ మళ్లీ డేట్ లు ఎప్పుడు సర్దుబాటు చేస్తారో చూడాలి. ఇక ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారు. ఇప్పటివరకు ఓ పాట తప్ప మరో అప్డేట్ రాలేదు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus