Acharya: ‘ఆచార్య’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ సేమ్‌ ప్లేస్‌లోనే అట!

‘ఆచార్య’ సినిమా ప్రిరిలీజ్‌ ఫంక్షన్ ఎక్కడ, గెస్ట్‌లు ఎవరు? ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం ఇదే. కారణం తెలియదు కానీ ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌ విజయవాడ టు హైదరాబాద్‌ షటిల్‌ సర్వీస్‌లా తిరుగుతోంది. కొత్త పుకార్ల ప్రకారం అయితే… ఇప్పుడు ఈవెంట్‌ హైదరాబాద్‌కి వచ్చేసింది అంటున్నారు. నిజానికి విజయవాడ వేదికగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చిరంజీవి భావించారట. కానీ ఇప్పుడు హైదరాబాద్‌కి మూవ్‌ చేశారని సమాచారం.

Click Here To Watch NOW

ఈ నెల 23న సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ పోలీసు గ్రౌండ్స్‌లోనే నిర్వహించాలని చూస్తున్నారట. ఈ కార్యక్రమానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే కార్యక్రమానికి గెస్ట్‌లు ఎవరు అనే విషయం బట్టే కార్యక్రమం ఎక్కడా అనేది తేలుతుంది అని చెబుతున్నారు. అంటే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వస్తే కార్యక్రమం విజయవాడలో ఉండొచ్చు.

ఒకవేళ ఆయనకు రావడం వీలుపడకపోతే ప్రిరిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో ఉండొచ్చు అని సమాచారం. టాలీవుడ్‌ టికెట్‌ కష్టాలను తీర్చడంలో చిరంజీవి పాత్ర చాలా కీలకంగా మారిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆచార్య’ కార్యక్రమానికి సీఎం జగన్‌ వస్తారని అంటున్నారు. దానికితోడు సినిమా నిర్మాత నిరంజన్‌ రెడ్డి జగన్‌కు బాగా సన్నిహితులు కూడా. అయితే సీఎం జగన్‌ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీంతో వేడుకకు వస్తారా? రారా? అనే అనుమానాలు ఉన్నాయి.

దీంతోనే హైదరాబాద్‌లో ఈవెంట్‌ పెట్టాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే ఈ ఈవెంట్‌ అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి హైదరాబాద్‌ వచ్చినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే తొలుత ‘ఆచార్య’ ప్రిరిలీజ్‌ అనుకున్నది హైదరాబాద్‌లోనే కాబట్టి. అంతేకాదు మెగా – మెగా పవర్‌ – పవర్‌ కాంబినేషన్‌ను ఒకే స్టేజీ మీద చూడాలంటే హైదరాబాద్‌లోనే కుదురుతుంది. ఏపీలో కార్యక్రమం పెడితే పవన్‌ కల్యాణ్‌ హాజరవడం అసాధ్యం. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus