నాని హీరోగా ఎనిమిదేళ్లలో 18 సినిమాలు చేశాడు (నేడు విడుదలవుతోన్న ‘మజ్ను’తో కలిపి). ఈ లెక్కకు మించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అతడికంటే ముందు పరిశ్రమలోకి అడుగుపెట్టినవారిలో కొంతమంది ఇప్పటికీ ఓ స్థానం సంపాదించుకునేందుకు పడరాని తిప్పలన్నీ పడుతున్నారు. మధ్యలో ఒకట్రెండు పరాజయాలు పలకరించినా ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నేడు ‘మజ్ను’గా తెరమీదికి రానున్నారు.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాత్రికేయులతో ముచ్చటించిన నాని “స్టార్ స్టేటస్ ఎలా అనిపిస్తోంది” అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “స్టార్ అనే పదానికి అర్థం మారుతూ ఉంటుంది. విలక్షణ పాత్రలు చేసి ఎన్టీఆర్ స్టార్ అయితే డాన్సులు, స్టైల్ తో చిరంజీవి స్టార్ అయ్యారు. అయితే నా దృష్టిలో ఎప్పటికైనా కథే స్టార్” అన్నారు. నటుడిగా ఎలాంటి పాత్రైనా చేయగలడని అనిపించుకోవడమే తనకిష్టమని చెప్పిన నాని స్టార్ అనే భ్రమలో లెక్కలు వేసుకోవడం తెలీదన్నారు.
తాను ఇప్పటివరకు హారర్ జోనర్ లో చేయలేదన్న నాని అది తనకి ఛాలెంజ్ అనిపించదన్నారు. సస్పెస్ ఏమిటన్నది తొలి ఆటకే తెలిసిపోతే ఇంకా సినిమాలో ఎలాంటి ఎక్సయిట్మెంట్ ఉండదని చెప్పి షాక్ ఇచ్చాడు. నాని చెప్పింది నిజమే అయినప్పటికీ కోట్లు కురిపిస్తున్న ఈ జోనర్ పరిశ్రమని ఎంతలా కుదిపేస్తుందో ప్రేక్షకులకు తెలియంది కాదు. ఇదిలా ఉంటే ‘నేను లోకల్’ సినిమాతో ఈ సంవత్సారాంతంలో మరోమారు అలరించనున్నాడు ఈ యువ హీరో.
https://www.youtube.com/watch?v=zv-thbp_-KI