తన లైఫ్ సీక్రెట్స్ బయట పెట్టిన బ్రహ్మాజీ

రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుండీ వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారిలో బ్రహ్మాజీ కూడా ఒకడు. మధ్యలో కొన్ని సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ పెద్దగా రాణించకపోవడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తూ వచ్చాడు. కామెడీ పండించడంలో కూడా బ్రహ్మాజీ సిద్ధహస్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇన్నేళ్ళ కెరీర్లో తన వ్యక్తిగత జీవితం గురించి బ్రహ్మాజీ ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా చెప్పుకొచ్చాడు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ… ‘నేను ఆల్రెడీ పెళ్లై కొడుకు ఉన్న శశ్వతిని వివాహం చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు రోజుల్లో శశ్వతితో పరిచయమైంది. అప్పటికే ఆమెకి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఉంది. ఆ సమయంలో మాత్రం.. ఆమెతో కొన్నాళ్లపాటు జర్నీ చేశాను… బాగా కనెక్ట్ అయ్యాను. అలా ఆమెని పెళ్ళి చేసుకున్నాను. నాకు నచ్చింది కాబట్టి పెళ్ళి చేసుకున్నాను.. అదేమీ గొప్ప విషయం కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడమనేది ముఖ్యం. ఆమెని పెళ్లి చేసుకున్న తరువాత పిల్లలు వద్దనుకున్నాను. నా భార్యకి అప్పటికే కొడుకు ఉన్నాడు… చిన్నప్పటి నుండీ వాడు కూడా నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ పిల్లలు వద్దనుకున్నాను. ఒకవేళ పిల్లలు పుడితే నేను స్వార్ధంగా ఆలోచిస్తానేమో అని భయపడి పిల్లలను వద్దనుకున్నాను. ఇక నా కొడుకుకి కూడా సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus