తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం అంటే ఈరోజుల్లో చిన్న విషయం కాదు. ప్రెజెంట్ జెనరేషన్లో చాలా మంది కపుల్స్ తల్లిదండ్రులు కాలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అలాంటిది కవల పిల్లలకు జన్మనివ్వడం అంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. అలా కవలలకు జన్మనిచ్చిన జంటల మొహాలను ఉదయం పూట(నిద్ర లేచిన వెంటనే) చూస్తే చాలా మంచిదని పెద్ద వాళ్ళు అంటుంటారు.
అయితే ఉదయం లేచిన దగ్గర్నుండి జనాలు ఎక్కువగా సినిమాల గురించి, సినిమా వాళ్ళ పర్సనల్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ.. మొబైల్ ఫోన్లలో వారి గురించిన న్యూస్..లు వెతుకుతూ ఉంటారు. కాబట్టి.. కవలలకి జన్మనిచ్చిన సినీ నటులు(Indian Actors) ఎవరో..ఆ లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
1)ఎన్టీఆర్ (NTR) : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు అలియాస్ సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు కవలలుగా నందమూరి రామకృష్ణ, నందమూరి సాయికృష్ణ జన్మించారు. వీరికి మొత్తం 12 మంది సంతానం అని ఎక్కువ మందికి తెలిసుండదు.
2)సంజయ్ దత్ : బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘ది రాజాసాబ్’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి సుపరిచితమే. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే సంజయ్ దత్, మాన్యత(మూడో భార్య) దంపతులు షహ్రాన్ (కుమారుడు), ఇక్రా (కుమార్తె) వంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయం కూడా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.
3)కరణ్ జోహార్: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా నటుడిగా పలు సినిమాల్లో సర్ప్రైజింగ్ రోల్స్ చేసి అలరించారు. ఈయన మ్యారీడ్ లైఫ్ అనేది పెద్ద మిస్టరీ. అయితే సరోగసి పద్ధతిలో యష్, రూహీ వంటి కవలలకు తండ్రయ్యారు కరణ్.
4)విగ్నేష్ శివన్ : కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతారతో చాలా ఏళ్ళు డేటింగ్ చేసి 2022 లో పెళ్లాడాడు. ఈ దంపతులు సరోగసి పద్ధతి ద్వారా ఉయిర్, ఉలగం అనే ఇద్దరు కుమారులు జన్మించిన విషయం తెలిసిందే.
5)ఎస్.పి. చరణ్: లెజెండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు.. ప్రముఖ గాయకుడు, నిర్మాత అయినటువంటి ఎస్.పి. చరణ్ నటుడిగా కూడా అనేక సినిమాల్లో అలరించారు. అయితే ఎస్.పి.చరణ్, అపర్ణ దంపతులకు కూడా కవల పిల్లలు జన్మించిన సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.
6) రాహుల్ రవీంద్రన్ : రాహుల్ రవీంద్రన్, చిన్మయి దంపతులకు కూడా దృప్త, శర్వాస్ అనే ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
7) భరత్: ‘బాయ్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత ‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 2013లో భరత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ జెస్లీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో ఈ జంట కవల పిల్లలకి(ఇద్దరూ అబ్బాయిలే) జన్మనిచ్చారు. వీరికి ఆద్యన్, జేన్ అంటూ నామకరణం చేశారు. వీరు ఐడెంటికల్ ట్విన్స్ అని అప్పట్లో టాక్ నడిచింది.
8) యాక్టర్ వీరేంద్ర చౌదరి :తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నమిత 2017 లో ప్రముఖ నటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కూడా 2022 ఆగస్టులో కవలలకు జన్మనిచ్చారు.
9)మంచు విష్ణు : మోహన్ బాబు తనయుడు మంచు విష్ణువర్ధన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతను విరోనికా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు ట్విన్స్(ఇద్దరు అమ్మాయిలు) ఆరియానా, వివియానా ఉన్న సంగతి తెలిసిందే.’కన్నప్ప’ సినిమాలో వీళ్ళు ఓ పాట కూడా పాడి సినిమా ప్రయాణం మొదలు పెట్టారు.
10) రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జనవరి 31 న కవల పిల్లలు(ఓ పాప, ఓ బాబు) జన్మించారు. అంతకు ముందు వీరు ఓ పాపకి జన్మనిచ్చారు.