ఇలాంటి సినిమాల్లో నన్ను ఎందుకు తీసుకోరు..?

సీనియర్ నటుడు జగపతి బాబు హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో భారీ సినిమాలు చేస్తూ తన డిమాండ్ పెంచుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో విలన్, ఫాదర్ రోల్స్ అంటే ముందుగా జగపతిబాబునే సంప్రదిస్తున్నారు. దానికి తగ్గట్లే ఆయనకి భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. అయితే తాను మరీ కాస్ట్లీ అనుకొని చిన్న సినిమాల్లో మంచి పాత్రలకు తనను తీసుకోవడం లేదని తాజాగా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు జగపతి.

ఇటీవల ‘ఆహా’లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని జగ్గూభాయ్ చిత్రయూనిట్ పై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. ఒక సినిమా హిట్ అవ్వడానికి.. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని ‘కలర్ ఫోటో’ రుజువు చేసిందని అన్నారు. ఇలాంటి యంగ్ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ కలిపి టాలెంట్ తో సినిమాలు చేస్తుంటే.. తనలాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని జగపతిబాబు అన్నారు.

ఇలాంటి సినిమాల్లో తనకు కూడా భాగస్వామ్యం ఉంటే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాలలో తాను నటించననో.. లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను సంప్రదించడం లేదేమోనని.. కానీ ఆ రెండు నిజం కాదని అన్నారు. ఆయన ట్వీట్ చూస్తుంటే చిన్న సినిమాల్లో మంచి పాత్రలు దొరికితే రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించడానికి సిద్ధమని చెప్పకనే చెప్పారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus