కొంతమంది విలన్లు అందమైన హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి చాలా మందికి తెలిసుంటుందో లేదో. రఘువరన్ నే తీసుకుందాం. అతను సీనియర్ నటి రోహిణి భర్త అని చాలా మందికి తెలీదు. ప్రకాష్ రాజ్ అయితే నటి లలిత్ కుమారిని వివాహం చేసుకున్నాడు. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ విలన్ తరుణ్ అరోరానే తీసుకుందాం. అతను సీనియర్ స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్త అని చాలా మందికి తెలీదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది.
అందులో జాన్ కొక్కెన్ జంట కూడా ఒకటి.జాన్ ఇప్పటివరకు 40 కి పైగా సినిమాల్లో నటించాడు.’డాన్ శీను’ ‘తీన్ మార్’ ‘1 నేనొక్కడినే’ ‘బాహుబలి’ ‘జనతా గ్యారేజ్’ ‘వెంకీ మామ’ ‘కె జి ఎఫ్ చాప్టర్ 1’ ‘కె జి ఎఫ్ చాప్టర్ 2’ ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో విలన్ గా నటించి పాపులర్ అయ్యాడు. ఇతను కూడా టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లాడాడు. ఆమె ఎవరో తెలుసు కదా. ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ పూజా రామచంద్రన్.
‘స్వామి రారా’ సినిమాతో పూజాకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, దోచేయ్, గంగ,కృష్ణార్జున యుద్ధం, త్రిపుర,గంగ(కాంచన 2) వంటి చిత్రాల్లో కూడా నటించి తన అందంతో అభినయంతో మంచి మార్కులు వేయించుకుంది. ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదట విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకున్న ఈమె.. తర్వాత మనస్పర్థల కారణంగా అతనితో విడాకులు తీసుకుంది. అటు తర్వాత జాన్ కొక్కెన్ ను వివాహం చేసుకుంది.జాన్ – పూజా..లకి ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. అతనికి కియాన్ కొక్కెన్ అంటూ నామకరణం చేశారు.