‘కృష్ణార్జున యుద్ధం’ సీన్ రిపీట్ కాకూడదని…?

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతుంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో క్రికెటర్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 19 న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ మారనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 19 కంటే ముందుగానే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చిందట. ఏప్రిల్ 25 న మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ‘జెర్సీ’ పూర్తి కలెక్షన్లను రాబట్టాలంటే కనీసం 2 వారాలు థియేటర్లలో ఉండాలి. ఈ కారణంగానే రిలీజ్ డేట్ మార్చాలని భావిస్తున్నారట. గత సంవత్సరం కూడా నాని ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలయ్యింది. ‘భరత్ అనే నేను’ చిత్రం ఎఫెక్ట్ ‘కృష్ణార్జున యుద్ధం’ పై గట్టిగా ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. దీంతో ఈ సారి ఆ సీన్ రిపీట్ కాకూడదని నాని నిర్మాతల్ని రిలీజ్ డేట్ ముందుకు జరుపాలని కోరాడట. మహేష్ ని కూడా ముద్దుగా నాని అని అందరూ పిలుస్తుంటారు కాబట్టి… సోషల్ మీడియాలో ‘నానికి భయపడ్డ నాని’ అని కొందరు కామెంట్లు కూడా పెట్టారు. దీంతో ఏప్రిల్ 5న గానీ .. ఏప్రిల్ 12న గాని ‘జెర్సీ’ చిత్రాన్ని విడుదుల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. అయితే 5న నాగచైతన్య – సమంతల ‘మజిలీ’ కూడా రిలీజ్ కాబోతుండగా .. 12 న సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది. వీళ్ళిద్దరితోనూ నానికి పెద్దగా పోటీ ఉండదని నాని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రెండు చిత్రాల్లో నాని ‘జెర్సీ’ కి ఏ చిత్రం పోటీగా నిలబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రం నుండీ మొదటి పాట ని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus