ఆ సినిమాకి నేనే నిర్మాత – హీరో నాని

హీరో నాని, మెహరిన్ జంటగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచి ఊపుమీదున్న నాని తాజాగా ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో ‘ధమాకా’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క తమిళ సూపర్ హిట్ చిత్రం ‘పణియారం పద్మినియుమ్’ ని రీమేక్ చేయనున్నట్లు నాని తెలిపాడు. ఇప్పటికే రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న నాని.. ఆ సినిమాకే తానే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపాడు.
ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే ఫియట్ పద్మిని కారును కూడా కొని తన గ్యారేజ్ లో పెట్టినట్లు నాని వెల్లడించాడు. ఇది ఒక తమిళ కామెడీ డ్రామా అని తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే ధీమాగా ఉన్నాడు నాని. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్నా, పెద్దా లేకుండా ప్రతి ఒక్క హీరో రేమకెల మీద దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus