Naresh: ఆ కంపెనీ చేతిలో మోసపోయానంటున్న నరేష్..?

విజయనిర్మల కుమారునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా నరేష్ నటించారు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ బిజీగా ఉన్నారు. అయితే నరేష్ కీస్టోస్‌ కంపెనీ తనను వ్యాపార లావాదేవీల విషయంలో మోసం చేసిందంటూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7.5 కోట్ల రూపాయలు కంపెనీ చేతిలో మోసపోయినట్లు నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నరేష్ పోలీసులను కోరారు. పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి తమ బిల్డర్స్ తో ఫినిక్స్‌లో అసోసియేట్‌ కావడంతో పాటు సైనింగ్ అథారిటీగా ఉన్నారని నరేష్ వెల్లడించారు. లింగం శ్రీనివాస్ తో ఉన్న పరిచయం వల్ల అతనికి ఏడున్నర కోట్ల రూపాయలు ఇచ్చానని ఆ డబ్బులు అతను తిరిగి ఇవ్వలేదని నరేష్ అన్నారు.

గడిచిన ఆరు సంవత్సరాలుగా డబ్బు రిటర్న్ ఇవ్వాలని అడుగుతున్నా అతను పట్టించుకోవడం లేదని నరేష్ తెలిపారు. నరేష్ పోలీసులకు చేసిన ఫిర్యాదు విషయంలో లింగం శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సీనియర్ హీరో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత నెలలో విడుదలైన శ్రీకారం, రంగ్ దే సినిమాలో కీలక పాత్రల్లో నటించి నరేష్ మెప్పించారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus