Naresh, Prakash Raj: ప్రకాష్ రాజ్ కు భారీ షాకిచ్చిన నరేష్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు విజయం సాధించడం కోసం నరేష్ ఎంతో శ్రమించిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచు కమిటీ మంచి కమిటీ అని నరేష్ అన్నారు. యువత, మహిళలతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ప్యానల్ లో ఉన్నారని నరేష్ చెప్పుకొచ్చారు. ‘మా’ సభ్యులకు అవకాశాల కోసం పోరాడతామని నరేష్ వెల్లడించారు. విష్ణు మంచి మేనిఫెస్టోతో వచ్చారని ఆ మేనిఫెస్టో మన పనులకు అద్దం పడుతుందని నరేష్ పేర్కొన్నారు.

మంత్రి తలసాని చొరవతో సీఎం కేసీఆర్ ను కలుస్తామని భవిష్యత్తు కొరకు పని చేద్దామని ఇప్పటివరకు అయిపోయిందేదో అయిపోయిందని నరేష్ చెప్పుకొచ్చారు. ‘మా’ మెరుగుపడాలని ఆరు సంవత్సరాలు పోరాటం చేశానని ‘మా’ సభ్యులకు అన్ని రకాలుగా సాయం చేశానని నరేష్ పేర్కొన్నారు. కోహినూర్ వజ్రం చిన్నదైనా పెద్దదైనా అది వజ్రమే అని ‘మా’ కమిటీ అద్భుతాలు చేస్తుందని నమ్ముతున్నానని నరేష్ చెప్పుకొచ్చారు. ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాల్సిన లేదంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ల గురించి నరేష్ స్పందించారు.

వెబ్ సైట్ లో వివరాలు ఉంటాయని చూసుకోవచ్చని నరేష్ చెప్పుకొచ్చారు. ఆరు సంవత్సరాల కృషికి విష్ణు రూపంలో మంచి భవిష్యత్ కనిపించిందని నరేష్ పేర్కొన్నారు. తుది శ్వాస వరకు ‘మా’ కోసం పని చేస్తానని నరేష్ అన్నారు. తాను పదవుల కొరకు ఎప్పుడూ ఉండనని బాధ్యతల కొరకు మాత్రమే ఉంటానని నరేష్ చెప్పుకొచ్చారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus