Actor Nassar: గాయాల పాలైన నటుడు నాజర్..!
- August 17, 2022 / 07:08 PM ISTByFilmy Focus
నటుడు నాజర్ కు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆయన గాయపడినట్లు సమాచారం. షూటింగ్‌లో భాగంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నాజర్ నటించిన ఓ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జరుగుతోంది. బుధవారం చిత్రీకరణ సమయంలో ఓ సీన్‌లో భాగంగా మెట్లు దిగుతున్న సందర్భంలో ఆయన కాలు జారి కిందపడ్డారు.దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. గాయాలతో పడి ఉన్న ఆయన్ని సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఆయనకు చికిత్స జరుగుతూనే ఉంది అని ఇన్సైడ్ టాక్.ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నాజర్‌తో పాటు సుహాసిని, మెహ్రీన్, షియాజీ షిండే వంటి నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో నాజర్ కొంచెం ఎక్కువగానే వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరిగింది.

అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ఉండడం వలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. లాక్‌డౌన్ టైంలో నాజర్… గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆయన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలను ఆయన సతీమణి ఖండించింది. ‘ఆయనకు సినిమా అనేది ఊపిరి లాంటిది.. దయచేసి ఇలాంటి ఫాల్స్ న్యూస్ లు స్ప్రెడ్ చేయకండి’ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.
‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?













