బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. స్టార్ గా ఎదిగారు నవాజుద్దీన్. దాదాపు పదేళ్ల క్రితం ‘గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్’ పాత్రతో మంచి పాపులారిటీ సాధించారు. అయితే అంతకముందు చాలా సినిమాల్లో చిన్న పాత్రలు, అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ మధ్యకాలంలో లీడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో చిన్న పాత్రలు చేయడంపై నవాజుద్దీన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తన కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న పాత్రలు చేశానని.. కానీ ఇకపై చిన్న పాత్రలు చేయడం తనవల్ల కాదని అన్నారు. ఇప్పుడు ఎవరైనా తనకు రూ.25 కోట్లు ఆఫర్ చేసినా.. చిన్న పాత్రలు చేయనని చెప్పుకొచ్చారు. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా వెల్లడించారు. డబ్బు, కీర్తి అనేవి మనం చేసే పనికి వచ్చే బై ప్రొడక్ట్స్ మాత్రమేనని తను భావిస్తున్నానని.. మీరు మీ పనిని సరిగ్గా చేస్తే, డబ్బు, కీర్తి మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయని అన్నారు.
మీరు వాటి వెంట పడితే.. వాటిని మీరు ఎప్పటికీ చేరుకోలేరని అన్నారు. కాబట్టి మీ పనిని మీరు ఉత్తమంగా చేస్తూ వెళ్లండని అన్నారు. ధనం, కీర్తి మీ బానిసలుగా మారి మీ వెంటే పరిగెత్తేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నవాజుద్దీన్.. కంగనా రనౌత్ నిర్మాణంలో ‘టీకు వెడ్స్ షేరు’తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?